బసవేశ్వరుడి స్ఫూర్తితో చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం: ఎంపీ ఆర్ కృష్ణయ్య

by Kodari Anjali |

రుగ్మతలను దురాచారాలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన బసవేశ్వరుడి స్ఫూర్తితో చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

బసవేశ్వరుడి స్ఫూర్తితో చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం: ఎంపీ ఆర్ కృష్ణయ్య
X

దిశ, రవీంద్ర భారతి: రుగ్మతలను దురాచారాలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన బసవేశ్వరుడి స్ఫూర్తితో చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రవీంద్రభారతిలోని ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వీరసేవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని లింగ బలిజలో పదవ తరగతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీలు కృష్ణయ్య, సురేష్ షెట్కర్ లు పాల్గొని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. బసవేశ్వరుడి బోధనలు నేటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ఆనాడే బసవేశ్వరుడు పూనుకున్నారని గుర్తు చేశారు.

బంగారు బాటలేసుకోవాలని పిలుపు..

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై లింగ బలిజ సంఘం నేతలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి శిఖరాలకు చేరుకోవాలని కోరారు. విద్యార్థులు లక్ష్యం పెట్టుకోవాలని, ఆ దిశగా కష్టపడాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మోటివేట్ చేయాలని కోరారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడుతూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలేసుకోవాలని పిలుపునిచ్చారు. లింగ బలిజ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం యువజన విభాగం అధ్యక్షులు భరత్ , కార్యదర్శి సోమేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ అధ్యక్షులు జిల్లపల్లి అంజి, విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్, ప్రతినిధులు రాజశేఖర్ అప్ప, రాచప్ప విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story