అయ్యప్ప భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు

by Ramesh Naini |

మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం రేపటి (జూన్ 14) నుంచి భక్తుల దర్శనార్థం పునఃప్రారంభం కానుంది.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి శబరిమలలో ప్రత్యేక పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిథున మాస పూజల నిమిత్తం కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయం రేపటి (జూన్ 14) నుంచి భక్తుల దర్శనార్థం పునఃప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో రేపు సాయంత్రం 5 గంటలకు మేళ్‌శాంతి ఈ.డి. ప్రసాద్‌ గర్భగుడి తలుపులు తెరిచి, ఆలయ సంప్రదాయం ప్రకారం దీపారాధన నిర్వహిస్తారు. ఈ నెలవారీ ప్రత్యేక పూజలు జూన్ 19 వరకు కొనసాగనున్నాయి.

స్వామివారి దర్శనం కోరుకునే భక్తుల సౌకర్యార్థం www.sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ వర్చువల్ క్యూ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. భక్తులు తమ స్లాట్‌లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. జూన్ 19వ తేదీ రాత్రి ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం భక్తులకు వీడ్కోలు పలికి తలుపులు మూసివేస్తారు.

Next Story