పార్టీలో లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే చర్యలే.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా ? అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీలో లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే చర్యలే.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా ? అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లేనప్పుడు కేసు ఎక్కడిది? నోటీసు మాత్రమే ఇచ్చిందని, మీనాక్షి నటరాజన్ కి కేసుకు అసలు సంబంధం లేదన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. అనేక అంశాలపై ఆయన స్పందించారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రాజ్య సభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో లీకు వీరులు గ్రీకు వీరులు ఉంటే సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసు చేరవేసిన వారు ఉంటే వారిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంత మాత్రాన కుట్రకు పాల్పడరని ఆయన స్పష్టం చేశారు.

మీనాక్షి తనకు సోదరి లాంటివారని, 24 గంటల్లో ఈసీ స్పందించకపోవడం విచారకరం, మీనాక్షి నటరాజన్‌ని బలి చేశారని మహేశ్​ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని ఇంత దుర్మార్గంగా అవమానిస్తారా? ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం చిగ్గుచేటు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా? సీంఎ అయ్యేవారా? అని నిలదీశారు. దేశంలో మోడీ చర్యలు పరాకాష్టకు చేరాయని, బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారని, 12 ఏళ్లలో మోడీ చేసింది ఏమి లేదు, ఓటు చోరీ చేసి ఇప్పుడు సీటు చోరీ చేశారని మహేశ్ ఆరోపణలు గుప్పించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంలో పీఎం ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యి కేసును తప్పుదోవ పట్టించారని, ఆర్వోకి తిరస్కరించే అధికారం లేకున్న తిరస్కరించారని ఈ అంశంలో ఆర్వోకి ఉరి వేసిన తప్పు లేదని ఆయన మండిపడ్డారు. నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అనేది దేశ రాజకీయాల్లో ఒక కళంకమని మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

షబ్బీర్ అలీకి షోకాజ్ ఇచ్చాం..

కామారెడ్డిలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. షబ్బీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని, తన ఆస్తులు, తన వ్యక్తిత్వం, తాను ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేర్పించారన్నారు. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందని, వివాదంపైన షబ్బీర్ అలీకి షోకాజ్ ఇచ్చామన్నారు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదని, మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.

మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ఫోర్త్ సిటీ అడ్డుకుంటామని అనడం మూర్ఖత్వం, బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల కాలంలో ఆర్థిక విధ్వంసం, భూ దోపిడీ, చేసిన అప్పులపై వివరణ ఇచ్చి బస్సు యాత్ర, పాదయాత్రలు చేయాలని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష్యతో మాట్లాడటం సరికాదన్నారు. కేటీఆర్ స్పందించాల్సింది మీనాక్షి నటరాజన్ గురించి అని, తాను ఏంటో కేటీఆర్ కంటే హరీశ్ రావుకు బాగా తెలుసన్నారు. ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చందని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని, తమ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలు సమానమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయం

కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయమని టీపీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఓడిపోతారని, అరాచకం చేస్తామని బీజేపీ ఎంపీ అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారని మహేశ్​ కుమార్ గౌడ్ మండిపడ్డారు.

Next Story