ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని పునర్ ఆలోచించి, వెనక్కు తీసుకోవాలని: ప్రొఫెసర్ కోదండరాం

by Kodari Anjali |

ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని పునర్ ఆలోచించి, వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని పునర్ ఆలోచించి, వెనక్కు తీసుకోవాలని: ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, ఖైరతాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని పునర్ ఆలోచించి, వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని సూచించారు. ఇటీవల మంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో 27 వేలు ఉన్న పాఠశాలను 4 వేలకు కుదిస్తామని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 'తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ క్లబ్‌లో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. విద్యపై ప్రభుత్వం కొన్ని అనుకూలమైన ప్రతిపాదనలు తీసుకొచ్చిన.. పాఠశాలలను కుదిస్తామని చెప్పడంతో ఈ రెంటి మధ్య వైరుధ్యం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ బడుల్లో టిఫిన్, లంచ్ పెడతానని చెప్పడం హర్షించదగ్గ విషయమైనా , ప్రభుత్వ పాఠశాలను విస్తరించి బలోపేతం చేయాలన్నారు.. ప్రభుత్వ బడులు మూసివేత నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ.. మనిషి అభివృద్ధి అంటే జ్ఞానం పొందడం, విద్యా వైద్యం అందరికీ అందించాలి.

మౌలికలు సదుపాయాలు కల్పించాలి..

పిల్లలు తక్కువ అని బడులు మూసేస్తే ... పిల్లలు బడిలోకి ఎందుకు రావడం లేదు అన్న దానిపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. సమాజానికి కావలసింది పాలకులు అందించాలి, అంతేకానీ ఏకపక్ష నిర్ణయంతో బడులు వేస్తాను అనడం కరెక్ట్ కాదన్నారు. సామాజిక మార్పుకు విద్య కాకుండా ఇంకా ఏమైనా ఉందా అంటూ హర గోపాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తామంతా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం.. ప్రభుత్వ స్కూళ్లకు మౌలికలు సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పాలకులు విద్య రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయిస్తే అభివృద్ధి చెందుతాయి అన్నారు. గురుకులాల్ల 27వేల ప్రభుత్వ స్కూల్స్‌ను ఎందుకు అభివృద్ధి చేయరు అన్నారు. ప్రభుత్వం కావాలనే ప్రభుత్వ స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్లో మూసివేతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. ప్రొఫెసర్ కే చక్రధర్ రావు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, విమలక్క, మూడవ శ్రీధర్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రతినిధి అన్వేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రతినిధి వర్ధన్, ఎస్ టి యు అధ్యక్షుడు సదానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story