- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా హార్ట్ బ్రేక్ అయింది : తమన్ ఎమోషనల్ పోస్ట్
తన హార్ట్ బ్రేక్ అయిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన హార్ట్ బ్రేక్ అయిందని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఓజీ టూర్ ఇండియా కాన్సెర్ట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా మొదలు కావలసి ఉండగా.. నగరంలో భారీ వర్షం కారణంగా ఆ ప్రోగ్రామ్ రద్దయింది. దీంతో తమన్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 45 రోజులుగా రాత్రింబగళ్లు, అలసట అనేది లేకుండా.. తాను, తన 56 మంది మెంబర్స్ టీమ్ ఈ కాన్సర్ట్ కోసం తీవ్రంగా శ్రమించామని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇంత ఎఫర్ట్స్ తో భారీ కాన్సెర్ట్ ను నిర్వహించాలని ప్రయత్నించినపుడు.. ఇలాంటి అడ్డంకులు వల్ల అది ఆగిపోవడం నిజంగా హృదయ విదారకంగా ఉంటుందన్నారు. ప్రతి ఫీడ్ బ్యాక్ ను పాజిటివ్ గా తీసుకుంటూ చేసిన ప్రయత్నం సామాన్యమైనది కాదని, దేవుడికి ఇంతకంటే బెటర్ ప్లాన్ ఉండి ఉంటుందని భావిస్తున్నానని తమన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కొన్నిసార్లు విధిని నమ్మక తప్పదన్నారు. తనపై అభిమానుల ప్రేమ, నమ్మకం ఎప్పటికీ తగ్గవని, కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని రాసుకొచ్చారు.






