మేడారం గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

by Kodari Anjali |

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, కొణతం చిన్న వెంకట్ రెడ్డి అన్నారు.

మేడారం గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
X

దిశ, నేరేడుచర్ల: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, కొణతం చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మేడారం గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, కొనతం చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించనున్న సంఘ బంధం భవనం, అంగన్వాడీ కేంద్రానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మేడారం గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు...

మహిళలు, చిన్నారులకు ఉపయోగపడే విధంగా అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే సంఘ బంధం భవనం గ్రామ ప్రజలకు సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ విజయలక్ష్మి నరసింహులు, వైస్ చైర్మన్ తాళ్లూరు సురేష్, ఎంపీడీఓ సోమ సుందర్ రెడ్డి ఎంపీఓ నాగరాజు, మేడారం గ్రామ సర్పంచ్ పారేపల్లి సత్యనారాయణ, కల్లూరు సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, మేడారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట కృష్ణారావు, జీల చెరువు చైర్మన్ మామిడి వెంకటేశ్వర్లు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కర్ణం రామానర్షు, పళ్ళ అంజయ్య, గొట్టెముక్కుల ముక్కంటి, సోం వెంకటి, కటికోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story