నా ఆస్తులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు: కేఏపాల్ సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

కూటమి నేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన చారిటీకి సంబంధించిన ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నా ఆస్తులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు: కేఏపాల్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(Praja Shanti Party President K.A. Paul) సంచలన ఆరోపణలు చేశారు. తన చారిటీకి సంబంధించిన ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతుంటే సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(BJP State President PVN Madhav) మాత్రం తన ఆస్తులను దెచుకునేందుకు పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నిస్తున్నానని, అందుకే తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. దీనిని తాను ఒప్పుకోనని హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపుకోసం పగలు, రాత్రి కూడా ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కేఏపాల్ కోరారు.

Next Story