మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

by Batti.Sumithra |

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు అన్నారు. శనివారం హసన్పర్తి మండలంలోని అర్వపల్లి, సీతంపేట, జాగిరి గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న గ్రామ సమైక్య భవనాలకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం అనంతసాగర్ లో నిర్మించిన గ్రామసమైక్య భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామ సమైక్య సంఘాల భవనాలు నిర్మించడం ద్వారా మహిళా స్వశక్తి సంఘాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

సీతంపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాకేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి, సీతంపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు బత్తిని స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Next Story