- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనావాసాల మధ్య దుర్వాసన వెదజల్లుతున్న చెత్తకుప్పలు
by Batti.Sumithra |
నాగోల్ సర్కిల్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ డివిజన్‌లోని కుంట్లూర్, శివారెడ్డి కాలనీలో ప్రధాన రహదారి వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి.

X
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : నాగోల్ సర్కిల్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట్ డివిజన్‌లోని కుంట్లూర్, శివారెడ్డి కాలనీలో ప్రధాన రహదారి వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రహదారుల వెంట చెత్తను ఎక్కడికక్కడ వేయడంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. చెత్తకుప్పల కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి, ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి, పట్టణంలో పర్యటించి చెత్తను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story






