- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇళ్లకు సమీపంలో చిరుతపులి కలకలం... ఉలిక్కిపడిన తిరుపతి జనం
తిరుపతిలో చిరుతపులి కలకలం రేపింది. గ్రాండ్ వరల్డ్ రోడ్డులోని ఇళ్లకు సమీపంలో సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లపైకి ఎక్కి చిరుతపులి వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో చిరుతపులి(Leopard) కలకలం రేపింది. గ్రాండ్ వరల్డ్ రోడ్డులోని ఇళ్లకు సమీపంలో సంచరిస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లపైకి ఎక్కి చిరుతపులి వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వైరల్ అయింది. అయితే విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలం వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చిరుతను అటవీ ప్రాంతం వైపు మళ్లిస్తామని, అప్పటివరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ కూడా సింగిల్‌గా వెళ్లొద్దని, చిన్న పిల్లలను అసలు బయటకు విడిచిపెట్టొదని తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని పేర్కొన్నారు. అయితే చిరుపులి ఒక్కసారి ఇళ్ల సమీపంలోకి రావడంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. త్వరగా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపించాయి.
Next Story






