బీవీఆర్‌ఐటీలో విజయవంతంగా ముగిసిన వామ్స్.. 2026 అంతర్జాతీయ సదస్సు

by Batti.Sumithra |

నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో నిర్వహించిన 5వ ఐఈఈఈ వైర్లెస్, యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం (వామ్స్–2026) అంతర్జాతీయ సదస్సు ఐదు రోజుల పాటు విజయవంతంగా కొనసాగి శనివారం ఘనంగా ముగిసింది.

బీవీఆర్‌ఐటీలో విజయవంతంగా ముగిసిన వామ్స్.. 2026 అంతర్జాతీయ సదస్సు
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో నిర్వహించిన 5వ ఐఈఈఈ వైర్లెస్, యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం (వామ్స్–2026) అంతర్జాతీయ సదస్సు ఐదు రోజుల పాటు విజయవంతంగా కొనసాగి శనివారం ఘనంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ సదస్సు శాస్త్రీయ పరిశోధనలు, పరిశ్రమ–విద్యాసంస్థల పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు సమర్థవంతమైన వేదికగా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి వామ్స్ సలహాదారు డా. సుధాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణురాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వామ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డులు..

వామ్స్ సదస్సులో అత్యున్నత గౌరవంగా భావించే డా. సుధాకర్ రావు స్పెషల్ రికగ్నిషన్ అవార్డును రూ.1,00,000 నగదు బహుమతితో ప్రొఫెసర్ సమీర్ చక్రవర్తి వేడుల, ప్రొఫెసర్ పి. సతీష్ రామచౌదరిలకు సంయుక్తంగా ప్రదానం చేశారు. వామ్స్ సదస్సు అభివృద్ధికి, ఇంజనీరింగ్ సమాజానికి వారు అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేశారు. అదే విధంగా, రూ.50,000 నగదు బహుమతితో కూడిన డా. సుధాకర్ రావు బెస్ట్ పేపర్ అవార్డును అహ్మదాబాద్‌లోని ఇస్రో–స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌కు చెందిన శ్రీ రోహిత్ నంద్వానీకి ఆయన అత్యుత్తమ పరిశోధనకు గాను ప్రదానం చేశారు. ఈ సదస్సును విజయవంతం చేయడంలో డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపల్ డా. సంజయ్ దూబే, మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ రంగ నిపుణులు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు, ఇస్రోతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొని సదస్సు విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.

Next Story