ప్రకృతి వింత.. నవ వధువును తలపిస్తున్న అద్భుత జలపాతం! నెట్టింట వైరల్

by Ramesh Naini |

ప్రకృతి సృష్టించే అద్భుతాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా పెరూ దేశంలోని ఓ జలపాతం పర్యాటకులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రకృతి వింత.. నవ వధువును తలపిస్తున్న అద్భుత జలపాతం! నెట్టింట వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రకృతి సృష్టించే అద్భుతాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తాజాగా పెరూ దేశంలోని ఓ జలపాతం పర్యాటకులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండ కోనల గుండా జాలువారుతున్న ఈ జలపాతం.. అచ్చం తెల్లటి పెళ్లి దుస్తుల్లో నిలబడిన నవ వధువును తలపిస్తుండటంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దట్టమైన ప్రకృతి సౌందర్యం మధ్య కొండపై నుంచి కిందకు పడుతున్న ఈ నీటి ప్రవాహం.. దూరం నుంచి చూస్తే పెళ్లి కూతురు ముఖం, ఆమె ధరించిన గౌను ఆకృతిలో కనువిందు చేస్తోంది.

వాటర్‌ఫాల్ ఆఫ్ ది బ్రైడ్..

అందుకే పర్యాటకులు, స్థానికులు దీనిని ముద్దుగా ‘వాటర్‌ఫాల్ ఆఫ్ ది బ్రైడ్’ (క్యాస్కేడా లా నోవియా) అని పిలుస్తారు. అయితే, ఈ అందమైన జలపాతం వెనుక ఓ విషాదకరమైన ప్రేమకథ కూడా దాగి ఉందని స్థానికులు చెబుతుంటారు. అద్భుతమైన ప్రకృతి మధ్య ప్రశాంతతను, కనువిందును పంచే ఈ జలపాతం వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఈ ప్రకృతి వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. కాగా, గత వర్షాకాల సమయంలోనూ ఈ జలపాతానికి సంబంధించిన ఇలాంటి వీడియోలే నెట్టింట తెగ వైరల్ కావడం గమనార్హం.

Next Story