- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలన పరిణామం.. తనను తాను వెనిజూలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్
వెనిజులా అధ్యక్షుడు నికలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ట్రంప్ తనను తాను ‘వెనిజూలా తాత్కాలిక అధ్యక్షుడి’గా ప్రకటించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనానికి తెర లేపారు. వెనిజులా అధ్యక్షుడు నికలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ట్రంప్ తనను తాను ‘వెనిజూలా తాత్కాలిక అధ్యక్షుడి’గా (Acting President of Venezuela) ప్రకటించుకున్నారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో తన అధికారిక చిత్రాన్ని షేర్ చేసిన ఆయన, దాని కింద "జనవరి 2026 నుండి బాధ్యతలు" అని పేర్కొన్నారు. వెనిజూలాలో సురక్షితమైన అధికార మార్పిడి జరిగే వరకు ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని, అక్కడి చమురు నిల్వలు, ఆదాయంపై తమకు పూర్తి నియంత్రణ ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల రవాణా ఆరోపణలపై మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత వెనిజూలాలో అనిశ్చితి నెలకొంది. అక్కడి రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ట్రంప్ తాజా ప్రకటనతో వెనిజూలాపై పెత్తనం పూర్తిగా వాషింగ్టన్ చేతుల్లోనే ఉంటుందని తేలిపోయింది. ఒక దేశాధినేత బాహటంగా మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పరిణామంపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
READ MORE ....
నాటోను కాపాడింది నేనే.. ఆపదలో వారు అండగా ఉంటారో లేదో: ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు.. ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చిన ఖమేనీ






