- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్ నినోపై ప్రజలకు భరోసా ఇవ్వండి : రవిచంద్ర
పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.

- తెలంగాణలో సాగు, తాగునీటి కొరత
- ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి
- బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ లీడర్ రవిచంద్ర
దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. పార్లమెంట్ వానాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యింది. పార్లమెంటరీ పార్టీ లీడర్‌గా నియమితులైన తర్వాత ఎంపీ రవిచంద్ర మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తాండవిస్తున్నదని.. ఈ పరిస్థితుల నుంచి బయటపడేలా ప్రజలకు భరోసా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానలు లేక రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీరు దొరకని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో కోతలు పెరిగిపోవడంపైనా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో హైదరాబాద్ నగరంలోనూ కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పేర్కొన్నారు. కేసీఆర్ 13 ఏళ్ల పోరాటం ఫలితంగా తాడిచర్ల -2 బొగ్గు గనిని సింగరేణి సంస్థకు అప్పగించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రైవేట్ చేతుల్లో ఉన్న కోయగూడెం-3, సత్తుపల్లి -3,శ్రావణపల్లి, పర్యావరణ అనుమతులిచ్చి గోలేటి, మణుగూరు, పూసపల్లి, మాదారం, కేకే గనులను సింగరేణి సంస్థకు బదలాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో, బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాకుండా సింగరేణి సంస్థకు లాభాలు పెరుగుతాయని, యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని, థర్మల్ పవర్ ఉత్పత్తికి దోహదపడుతుందని వివరించారు. కన్నెపల్లి నుంచి నీళ్లను పంపింగ్ చేసినట్టయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి నీళ్లను బనకచర్లకు తరలించడానికి అనుమతులిస్తూ, తెలంగాణలోని అంబేద్కర్-వాద్రా, సీతమ్మ, సమ్మక్క-సారలమ్మ సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయకపోవడం విచారకరమని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా, ఐఐఎం మంజూరు చేయాల్సిందిగా, హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.






