- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర విషాదం.. కొండ చరియలు విరిగిపడి 8 మంది మృతి
నాగాలాండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మోన్ జిల్లాలో వర్షాలతో వచ్చిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ఇల్లు వరదల్లో కొట్టుకుపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: నాగాలాండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మోన్ జిల్లాలో వర్షాలతో వచ్చిన వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ఇల్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుండి ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీశాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయకచర్యలకు అంతరాయం కలుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఘటనపై సీఎం నీఫియూ రియో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి, రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నాగాలాండ్ లోని మోన్ జిల్లాతో పాటు, మోకోక్ చుంగ్ జిల్లాలోని తూలి, ఇతర ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం, వరదలు, రహదారుల దిగ్భంధం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.






