- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: బ్రేకులు ఫెయిలై బొలెరో బోల్తా.. ఇద్దరు మృతి, పది మందికి తీవ్ర గాయాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల పరిధిలోని గుర్రాలపాలెంనకు చెందిన గ్రామస్థులు రెండు వాహనాల్లో వెళ్లి పాడేరు అమ్మవారి పాదాలు వద్ద పండుగ చేసుకున్నారు. అయితే, ఆదివారం రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఘాటి మార్గంలో పాడేరు ఘాట్ రోడ్ కోమలమ్మ పనుకు మలుపులో బ్రేకులు ఫెయిలై బొలెరో వ్యాన్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, మృతులు దివి చలపతిరావు, సూరిశెట్టి అప్పారావుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






