- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటోను కాపాడింది నేనే.. ఆపదలో వారు అండగా ఉంటారో లేదో: ట్రంప్
సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన డొనాల్డ్ ట్రంప్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 'నాటో' (NATO) కూటమి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 'నాటో' (NATO) కూటమి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే నాటోను కాపాడానని, తన ఒత్తిడి వల్ల సభ్య దేశాలు ఇప్పుడు తమ రక్షణ వ్యయాన్ని GDPలో 2% నుండి 5.5%కి పెంచాయని ఆయన పేర్కొన్నారు. "ఒకవేళ తాను అధ్యక్షుడిగా లేకపోతే అసలు నాటో (Nato) నే ఉండేది కాదని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో సభ్య దేశాలు కేవలం 2% మాత్రమే చెల్లించేవని, కానీ ఇప్పుడు వారు 5% పైగా చెల్లిస్తున్నారని, ఈ ఘనత పూర్తిగా తనదేనని ట్రంప్ చెప్పుకున్నారు.
నాటో పట్ల తనకున్న సందేహాలను కూడా ట్రంప్ బయటపెట్టారు. "నాకు నాటో అంటే ఇష్టం, కానీ అమెరికాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు మనకు అండగా ఉంటాయా లేదా అనేది అనుమానమే," అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా నాటో కోసం భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కష్ట సమయాల్లో కూటమి సహకారంపై తనకు నమ్మకం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాను అమెరికాను కూటమి నుంచి బయటకు తీసుకు వస్తే నాటో దేశాలు బాధ పడవచ్చని, తద్వారా ఆయా దేశాలకు చాలా డబ్బు ఆదా అవుతుందని కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికి ట్రంప్ ప్రవర్తనతో ఆయా దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
READ MORE ....






