- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉష్ గప్ చుప్.. అంతా కాంప్రమైజ్?
ఎక్కడ ఏమి జరిగితే మనకేంటి? అధికార పార్టీ నేతల ఆగడాలతో జనం పడే ఇబ్బందులతో మనకు నష్టం ఏంటి? అన్నట్లుగా తయారైంది కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పరిస్థితి.

దిశ, కరీంనగర్ బ్యూరో: ఎక్కడ ఏమి జరిగితే మనకేంటి? అధికార పార్టీ నేతల ఆగడాలతో జనం పడే ఇబ్బందులతో మనకు నష్టం ఏంటి? అన్నట్లుగా తయారైంది కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పరిస్థితి. నియోజకవర్గంలో ఏమి జరిగినా అధికార పార్టీ నాయకుని అనుచరుడి ఆగడాలు శృతిమించిన, మనుషుల ప్రాణాలు పోతున్న, అక్రమంగా అధికారుల బదిలీలు జరుగుతున్న, సామాన్యులపై అక్రమ కేసులు నమోదు అవుతున్న అంతా గప్ చుప్.. ప్రశ్నిస్తే మనల్ని ఏం చేస్తారు ఏ కేసులో ఇరికించి బొక్కలో తోస్తారో ఎందుకు వచ్చిన తంటా బ్రతికి ఉంటే తర్వాత ప్రతిపక్షంలో ఉండవచ్చు లేదా అధికార పార్టీలో కొనసాగవచ్చు అన్నట్టుగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది.
అధికార పార్టీ కనుసన్నల్లో ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు..
అధికార పార్టీ ఆగడాలను అరికడుతూ అక్రమాలను అడ్డుకుంటూ ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అధికార పార్టీతో రాజీ కుదుర్చుకుని రాజకీయాలు సాగిస్తున్నాయా?అంటే అవుననక తప్పని పరిస్థితి నెలకొంది. మానకొండూర్ నియోజకవర్గంలో అధికారం కోల్పోయిన రెండేళ్లలోనే బిఆర్ఎస్ అభద్రత భావంలోకి వెళ్లిందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అదికార పార్టీ నాయకులు ఇక్కడ అధికారికంగా అక్రమ దందాలు సాగిస్తున్న సహజ సంపదను దోచుకుంటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న చూసి చూడనట్లుగా ఉండటం విమర్శలకు బలం చేకూరుస్తుండగా.. ఇతర పార్టీ నాయకులు కూడా నోరు మెదపక పోవడం పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించే వారే లేరా? అని సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజా సంఘాలు ఎక్కడ?
అధికార పార్టీ నేతల ఆగడాలతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ అణచివేతకు గురవుతుంటే ప్రశ్నించాల్సిన ప్రజా సంఘాలు ఎక్కడ? అంటు మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ చిన్న చిన్న ఘటనలపై నిరసనలు ఆందోళనలతో అదరగొట్టే ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు, యువజన సంఘాలకు మానకొండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు కనపడటం లేదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలో ఓ మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త పై అక్రమ కేసులు బనాయించడంతో భయాందోళనకు గురైన రాజేందర్ రెడ్డి స్థానిక శాసన సభ్యుడి క్యాంపు కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కనికరం లేకుండా కేసులు నమోదు చేస్తు కర్కశంగా వ్యవహరిస్తున్న పాలకుల నిరంకుశ పాలన కళ్లకు కనబడటం లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
స్పందించిన రసమయి తెరచాటున క్యాడర్..
మానకొండూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడమే మానేశారు అని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నాయకుని అనుచరుడి అడుగులకు మడుగులొత్తుతూ చాటుమాటున వారికి కావలసిన పనులను చక్కబెట్టుకుంటూ వినయ విధేయతలను ప్రదర్శిస్తూ సమాజ హితం అనే పదాన్ని స్వార్థానికి వదిలివేసి ప్రతిపక్ష హోదాను మరిచి ప్రవర్తిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
పెద్ద పెద్ద అధికారులు సైతం వారి కనుసన్నల్లో పనిచేస్తుంటే ఎదురు తిరిగి ప్రశ్నిస్తే ఏమవుతుందో అనే భావనతో పాటు లోలోపల మంచిగా ఉండి ఏం జరిగినా మనకేంటి అని ఉండడమే మేలు అనుకుంటున్నారు నాయకులు ప్రజానీకం. గుండ్లపల్లి సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం విషయంలో నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ టీవీ ఛానల్ లో ప్రశ్నించి ఖండించి ఆందోళన తెలిపి తన పాత్ర ప్రదర్శించినప్పటికీ నియోజకవర్గంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కేడర్ మాత్రం మాకెందుకు వచ్చిన తంటా అని నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ బాటలో బీజేపీ నేతలు..
కేంద్రంలో అధికారంలో ఉన్న జిల్లాలో ప్రజల ఆదరణ పొందిన మంచి ఫామ్ లో ఉన్న రాష్ట్రంలో అదికారంలో ఉండి అరాచకాలు చేస్తు జనాన్ని వేధిస్తున్న బిజెపి కార్యకర్తలు స్పందించకపోవడం కనీసం వారికి మద్దతుగా నిలవకపోవడంతో బిఆర్ఎస్ బాటలోనే బిజేపి నడుస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో గుండ్లపల్లి స్టేజి వద్ద బీజేపీ జెండా గద్దెను ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి రాజేందర్ రెడ్డి కృషి చేశాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల జెండా ఆవిష్కరణ సమయంలో ఆయనను ఆ వేడుకలో శాలువాతో సత్కరించి గౌరవించి సంబర పరచిన బిజెపి పార్టీ నాయకులు నేడు ఆయన అధికార పార్టీ నాయకుని అనుచరుని కుట్రకు బలై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆయన వైపు కనీసం తొంగి చూడకుండా జరిగిన అరాచకాన్ని ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ హిందూ మతం కోసం మంచి నినాదం ముద్రించుకుంటే పోలీసులు ఆయనను వేధించారన్న విషయం పై పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న బిజెపి నాయకులు స్పందించారు. ఇక్కడ మాత్రం కేంద్రమంత్రి ఇలా కా లో సర్పంచ్ భర్త దుస్థితికి ఏ ఒక్క బీజేపీ నాయకుడు పోరాడింది లేదు కనీసం ఖండించింది లేదు ఎందుకు ఈ పరిస్థితి అంతా కాంప్రమైజ్ నడుస్తుందా అని ప్రజలు అనుమానిస్తున్నారు.
ఎర్రజెండా పోరాట పటిమ ఏమైంది?
చిన్న చిన్న సమస్యలకు రోడ్డెక్కి పోరాడే ఎర్రజెండా పార్టీలు సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీలు రోజురోజుకు తమ పోరాట పటిమను కోల్పోతున్నాయా ? లేక ఎదురించే శక్తి ని కోల్పోయి చతికిల పడ్డాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రజలు పాలకుల చేతిలో నలిగిపోతుంటే కనీసం ఈ అంశంపై మాట్లాడిన దాఖలాలు లేకపోవడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరు కూడా కాంప్రమైజ్ అయ్యారా అనే అనుమానం ప్రజల వ్యక్తం చేస్తున్నారు.
పౌర హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ కమిషన్లకు ఈ అంశం చేరలేదా, చిన్నచిన్న అంశాలకు సోషల్ మీడియా వేదికగా స్పందించే యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదు భయమా ? బాధ్యతారాహిత్యమా అని బాధిత కుటుంబం బాధ వెళ్లబోసుకుంటుంది. ఒక సర్పంచ్ భర్తకే ఇలాంటి దుస్థితి వస్తే స్పందించని ప్రజానీకం సామాన్యునికి వస్తే స్పందిస్తుందా ఇప్పటికైనా ప్రతి పక్షాలు ప్రజా సంఘాలు యువజన సంఘాలు వెంటిలేటర్ పై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి దుస్థితికి కారకులపై పోరాటం సాగిస్తారా లేదా వేచి చూడాల్సిందే.






