ఆహార సంస్థల భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హెచ్ ఫాస్ట్ దాడులు

by Kodari Anjali |

అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారాన్ని తయారు చేసి విక్రయాలు చేస్తున్న పలు వ్యాపార సంస్థలపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు.

ఆహార సంస్థల భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హెచ్ ఫాస్ట్ దాడులు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: అపరిశుభ్రమైన పరిస్థితులలో ఆహారాన్ని తయారు చేసి విక్రయాలు చేస్తున్న పలు వ్యాపార సంస్థలపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగించడం, కృత్రిమ రంగులను వాడటం, గడువు ముగిసిన, నకిలీ/తప్పుడు బ్రాండ్ కలిగిన ఆహార ఉత్పత్తుల విక్రయించడం, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకపోవడం, ఆహార ఉత్పత్తులపై సరైన లేబులింగ్ లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ (కీటకాల నివారణ), నీటి విశ్లేషణ పరీక్షలు, ఆహార పరీక్షలు , సిబ్బంది ఆరోగ్య రికార్డులు లేకపోవడం, ఆహార పదార్థాలను అస్తవ్యస్తంగా, తగని రీతిలో నిల్వ చేయకపోవడం, ఆహారాన్ని హ్యాండిల్ చేసే సిబ్బంది హెయిర్ నెట్స్, గ్లౌజులు , ఇతర రక్షణ దుస్తులను ధరించకపోవడం, కీటకాలు, బొద్దింకలు పావురాల సంచారం ఎక్కువగా ఉండటం వంటివి అధికారులు ఈ దాడులలో గుర్తించారు . ఈ మేరకు టాస్క ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ప్రత్యేక తనిఖీలను జీహెచ్‌ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో నిర్వహించడం జరిగిందని చెప్పారు. తనిఖీలలో భాగంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 (ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం) కింద ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించడం జరిగిందని, వారి నుండి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్ధాలను ప్రయోగశాల విశ్లేషణ కోసం పంపించామన్నారు. వినియోగదారులు ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ లైసెన్స్, తయారీ, గడువు ముగిసే తేదీలను, అలాగే సరైన లేబులింగ్‌ను చెక్ చేసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల నిమిత్తం టోల్-ఫ్రీ నంబర్ 8712661212 ను సంప్రదించాలని సూచించారు.

దాడులు నిర్వహించిన సంస్థల వివరాలు..

1. బహదూర్ పురాలోని మెసర్స్ కేఓపీ ఆప్రో టెక్ లిమిటెడ్ (వంట నూనె & బాస్మతి బియ్యం రీప్యాకింగ్ యూనిట్) .2. కిషన్ బాగ్ లోని మెసర్స్ స్నాజీ ఐస్ క్రీమ్ (ఐస్ క్రీమ్ తయారీ యూనిట్), కిషన్ బాగ్.

3. సికింద్రాబాద్ మైలార్ గడ్డ లోని మురుకులు (నమ్‌కీన్స్) తయారు చేస్తున్న మెసర్స్ వీరభద్ర ఎంటర్‌ప్రైజెస్

4. మల్కాజ్ గిరిలోని ఎస్ ఎస్ బేకరీ

5. బేగంబజార్ లోని ఆహార రిటైల్ సంస్థ మెసర్స్ ఎంఎం కిరాణా అండ్ డ్రై ఫ్రూట్స్ స్టోర్స్

6. సికింద్రాబాద్ మైలార్ గడ్డకు చెందిన ట్విన్ సిటీస్ ఎంటర్‌ప్రైజెస్ (మురుకుల తయారీ యూనిట్)

Next Story