- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ..
సిరిసిల్ల ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు చంద్రంపేటకు చెందిన మారోజు పల్లవి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లేందుకు చంద్రంపేట నుంచి ఆటోలో సిరిసిల్ల పాత బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి నుంచి టీఎస్ 23 జడ్ 0026 నెంబరు గల కామారెడ్డి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం ప్రారంభించింది. బస్సు కొత్త బస్టాండ్‌కు చేరుకునేలోపే మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు కనిపించకపోవడంతో ఆమె అప్రమత్తమైంది. వెంటనే బస్సును ఆపించి పోలీసులకు 100కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అనంతరం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలో రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికులు తమ బంగారు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. చోరీకి గురైన తన పుస్తెలతాడును గుర్తించి తిరిగి ఇప్పించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు పల్లవి పోలీసులను కోరింది.






