Missing: మహానగరంలో మరో సెన్సేషన్.. ఏకంగా ముగ్గురు బాలికలు మిస్సింగ్!

by Kema Shiva Kumar |

Missing: మహానగరంలో మరో సెన్సేషన్.. ఏకంగా ముగ్గురు బాలికలు మిస్సింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఒకసారి ముగ్గురు బాలికలు ఆకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అయితే, ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన ఆ ముగ్గురు ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం నుంచి వచ్చి దోమలగూడ (Domalaguda) ప్రాంతంలో నివాసముంటున్న వలస కార్మిక కుటుంబాలకు చెందిన స్నేహ, లలిత, లత అనే ముగ్గురు బాలికలు ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లారు. రాత్రి అయినా వారు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో వెంటనే దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాచిగూడ రైల్వే‌ స్టేషన్ వద్ద..

అయితే, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో బాలికలు మొదట హిమాయత్‌నగర్ ప్రాంతంలో ఓ ఆటో ఎక్కినట్లుగా గుర్తించారు. అనంతరం ఆ ఆటో కాచిగూడ రైల్వేస్టేషన్‌ (Kachiguda Railway Station) వద్దకు చేరుకోగా, అక్కడ బాలికలు ఆటో దిగినట్లుగా సీసీటీవీ ఫుటేజీ‌లో స్పష్టంగా రికార్డు అయింది. అయితే, వాళ్లు రైల్వే స్టేషన్‌కు ఎందుకు వెళ్లారు..? సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ వెళ్లేందుకు రైలు ఎక్కారా లేక వేరే ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపి ఇన్వెస్టిగేషన్‌ను ముమ్మరం చేశారు.

Next Story