ఆరుగురి హత్య కేసు.. షాద్‌నగర్‌లో పోస్టుమార్టానికి నిరాకరణ

by Ratna Kumari |   (  Updated:2026-07-11 05:53:19  IST  )

షాబాద్ మండలంలోని దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో మృతదేహాల పోస్టుమార్టంపై కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆరుగురి హత్య కేసు.. షాద్‌నగర్‌లో పోస్టుమార్టానికి నిరాకరణ
X

దిశ, చేవెళ్ల : షాబాద్ మండలంలోని దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో మృతదేహాల పోస్టుమార్టంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలుత మృతదేహాలను పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది.

అయితే, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు ఆసుపత్రికి వచ్చే ఇతర రోగులకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుందని స్థానిక వైద్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆరుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆ ఆరు హత్యలకు బాధ్యుడు సీఎం రేవంతే.. రాజీనామాకు TRS చీఫ్ కవిత డిమాండ్

ఉన్మాదిలా ఆరుగురి నరమేధం.. నిందితుడి FIRలో దిమ్మతిరిగే విషయాలు

Next Story