- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఆరు హత్యలకు బాధ్యుడు సీఎం రేవంతే.. రాజీనామాకు TRS చీఫ్ కవిత డిమాండ్
షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడలో ఆరుగురి హత్యలపై టీఆర్ఎస్ చీఫ్ నేత కల్వకుంట్ల కవిత ఘాటు రియాక్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడలో జరిగిన ఆరు హత్యలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడంపై విపక్షాలు, అధికార పక్షాల మధ్య విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha), ఈ ఆరు హత్యలపై ‘X’ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ నగర శివార్లలో ఒకేరోజు ఆరు హత్యలు జరిగాయంటూ రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
పోక్సో కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను, తల్లిని, నాయనమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడని కవిత పేర్కొన్నారు. చివరికి కనికరం కూడా లేకుండా భార్య, పిల్లలను చంపేయడం దారుణమని అన్నారు. ఇన్ని హత్యలు చేస్తున్నా నిఘా వ్యవస్థ, పోలీసులు నిందితుడిని ఆపలేకపోవడం సిగ్గుచేటని కామెంట్ చేశారు. ఇంతటి క్రూర నేర ప్రవృత్తి ఉండి పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని.. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ఆరుగురి హత్యలకు కారణమైన, సీఎం మరియు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తన పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






