- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉన్మాదిలా ఆరుగురి నరమేధం.. నిందితుడి FIRలో దిమ్మతిరిగే విషయాలు
అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో ఉన్మాది రాజ్‌కుమార్ సాగించిన ఆరుగురి నరమేధం ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్/షాబాద్/చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా షాబాద్ (Shabad) పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురి దారుణ హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నిందితుడు రాజ్‌కుమార్ (Raj Kumar)పై గతంలోనే ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ బాలిక తరఫు మృతుల బంధువులు, గ్రామస్థులు షాబాద్ పీఎస్ ఎదుట షాబాద్-కంది రహదారిపై బైఠాయించి భారీ ఆందోళనకు దిగారు.
ఎఫ్‌ఐఆర్‌లో నిర్ఘాంతపోయే నిజాలు
అయితే, ప్రధాన నిందితుడైన రాజ్‌కుమార్‌పై నమోదైన పోక్సో ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీలోని వివరాలు ఇప్పుడు అందరినీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత 6 నెలలుగా రాజ్‌కుమార్ సదరు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, కలవాలంటూ నిరంతరం బలవంతం చేసేవాడని తెలుస్తోంది. శంషాబాద్‌లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ రాజ్‌కుమార్ వేధింపులు మితిమీరడంతో, అతడి భయానికి తాళలేక తల్లి ఆ బాలికను కాలేజీకి పంపడం మాన్పించేసింది. ఇటీవల పరీక్షలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి దగ్గరుండి బాలికను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లింది. అయితే, పరీక్ష ముగిసిన వెంటనే బాలికను అందరూ చూస్తుండగానే లాక్కెళ్లేందుకు రాజ్‌కుమార్ ప్రయత్నించాడు. ‘గతంలో నీ తండ్రిని ఫుల్లుగా తాగించి హార్ట్ ఎటాక్ అని చెప్పి నమ్మించి చంపినట్లే, మిమ్మల్ని కూడా చంపేస్తా’ అంటూ రాజ్‌కుమార్ బాలికను, ఆమె తల్లిని తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రాణభయంతో తమను కాపాడాలంటూ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది వరకే నిందితుడిపై కేసు నమోదు..
ఉన్మాది రాజ్‌కుమార్‌కు ఈ కేసే మొదటిది కాదని తెలుస్తోంది. గతంలోనూ ఓ భూతగాదా విషయంలో ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టి, చంపేస్తానని బెదిరించినట్లుగా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తిపై, ఓ తల్లి తన కూతురి ప్రాణాలు కాపాడాలని మొరపెట్టుకున్నా పోలీసులు నామమాత్రంగా స్పందించడం వల్లే ఇవాళ ఆరుగురి ప్రాణాలు పోయాయంటూ మృతుల బంధువులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
రాత్రి 11 గంటల నుంచి హత్యలు షురూ.. భార్య, పిల్లలను కూడా
ఉన్మాది రాజ్‌కుమార్ కేవలం రెండు గంటల వ్యవధిలో సాగించిన నరమేధం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. రాత్రి 11 గంటల సమయంలో సదరు మైనర్ బాలిక ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్, ఆమె అమ్మమ్మ, నాయనమ్మ ఎంత వారించినా వినకుండా బాలికను బలవంతంగా కారులో 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఉన్మాది, తిరిగి బాలిక ఇంటికి వచ్చి తనను అడ్డుకున్నారనే కక్షతో ఆమె అమ్మమ్మ, నాయనమ్మలను కూడా అతి కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన ఇంటికి బయల్దేరి, దారిలో భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూస్తానని చెప్పాడు. ఇంట్లోకి వెళ్లడమే ఆలస్యం భార్యపై కత్తితో దాడి చేయగా, ఆమె ప్రాణభయంతో బయటకు పరుగులు తీసినప్పటికీ వదలకుండా ఈడ్చుకుంటూ లోపలికి లాకెళ్లి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న తన ఇద్దరు కన్న పిల్లలను సైతం ఏమాత్రం జాలి లేకుండా గొంతు కోసి మట్టుబెట్టాడు. ఇలా కేవలం రెండు గంటల్లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న రాజ్‌కుమార్, వారికి రక్తం ఒడుతున్న కారులోనే అక్కడి నుంచి పరారవుతూ తన తండ్రికి ఫోన్ చేసి ’నేను ఆరుగురిని చంపేశాను’ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
స్పందించిన సీపీ తరుణ్ జోషి..
దైవాలగూడలో ఆరుగురి హత్యలపై తాజాగా సీపీ తరుణ్ జోషి స్పందించారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై మే 16 కేసు నమోదైందని తెలిపారు. అనంతరం అతడు పరారయ్యాడని, అప్పటి నంచి అతడి కోసం గాలించామని అన్నారు. తర్వాత రాజ్‌కుమార్ బెయిల్ వచ్చి బయటకు వచ్చాడని.. అతడికి రెండు, మూడుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని, రాజ్‌కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. అతడికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాటు కూడా ఉందని తెలిపారు. మరోవైపు భార్య, పిల్లల హత్యపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజ్‌కుమార్ కోసం 7 టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.






