- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక ఓటీటీ సినిమాలకు సెన్సార్ కత్తెర? సంచలన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం
దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' సినిమా వివాదంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం (Govt. of India) కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటి వరకు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ బోర్డు (Censor Board) నిబంధనలను, ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ పంజాబీ నటుడు, సింగర్ దిల్జీత్ దోసాంజ్ నటించిన ‘సట్లెజ్’ (Satluj) సినిమా వివాదమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే, దర్శకుడు హనీ ట్రెహన్ తెరకెక్కించిన ‘సట్లెజ్’ పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల ఉద్వేగభరిత ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా రూపొందింది. 1980, 90ల కాలంలో పంజాబ్‌లో జరిగిన అపహరణలు, అక్రమ కాల్పుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే, ఈ సినిమాకు థియేట్రికల్ విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఏకంగా 127 కట్స్ విధించడంతో పాటు పేరును కూడా ‘పంజాబ్ 95’ నుంచి ‘సట్లెజ్’గా మార్చాలని కోరింది. ఇన్ని కట్స్‌తో సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని మేకర్స్, థియేటర్ విడుదలను పక్కన పెట్టి ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా నేరుగా ‘జీ5’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ రిలీజ్ చేశారు.
విడుదలైన 48 గంటల్లోనే ఓటీటీ నుంచి ‘సట్లెజ్’ అవుట్..
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రస్తుతానికి సెన్సార్ బోర్డు (CBFC) అనుమతి అవసరం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని సెన్సార్ బోర్డు తిరస్కరించిన కట్స్‌ను కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఐటీ చట్టం కింద శాంతిభద్రతల సమస్యలను వస్తాయని చెబుతూ.. విడుదలైన 48 గంటల్లోనే ‘సట్లెజ్’ సినిమాను జీ5 నుంచి ప్రభుత్వం తొలగించింది. దీంతో ఇకపై ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.






