నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం.. ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు

by Kema Shiva Kumar |

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం దక్కింది.

నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం.. ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు కోడలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి (Brahmani)కి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ప్రతిష్టాత్మక మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (Most Powerful Women) జాబితాలో ఆమె స్థానం సంపాదించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలతో కూడిన ఈ జాబితాలో బ్రాహ్మణి నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన ప్రస్థానాన్ని, సంస్థ వృద్ధిని వివరించారు. ముఖ్యంగా డెయిరీ రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రైతుల సంక్షేమం కోసం హెరిటేజ్ సంస్థ తీసుకుంటున్న వినూత్న చర్యలను ఈ వేదికపై బ్రాహ్మణి ప్రముఖంగా ప్రస్తావించారు. అయతే, తన భార్య సాధించిన ఈ అరుదైన విజయంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.

Next Story