- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్‌కు ‘హైడ్రా’ నోటీసులు.. దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా, జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇవ్వడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలపై ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ (Pradeep Constructions)కు జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులో సదరు సంస్థ నిర్మిస్తున్న 17 అంతస్తుల నివాస సముదాయానికి మంజూరు చేసిన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్‌కు హైడ్రా (HYDRAA) నోటీసులు ఇవ్వడాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు. హైడ్రా ఒక అడుగు వెనక్కు వేసినా తాను 10 అడుగులు ముందుకెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందని ఆనాడే చెప్పినా.. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. నేడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ కాపాడుకోడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా ప్రజలు ఆందోళన చెందవద్దని, బస్తీ ప్రజల ఇళ్లకు ఎలాంటి నష్టం జరగదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. బస్తీలో వేస్తున్న రోడ్ల వల్ల ఇళ్లు కోల్పోతే వారికి స్థానికంగానే ఇల్లుకు ఇల్లుకు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానం నాగేందర్ స్పష్టం చేశారు.






