అత్యాధునిక వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి రావాలి

by Ratna Kumari |

పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

అత్యాధునిక వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి రావాలి
X

దిశ, ఆమనగల్లు : పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై పోస్టాఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'విహా' మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. తలకొండపల్లి మండలానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేష్ దంపతుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, సీఐ వెంకటేశ్వర్లతో కలిసి రిబ్బన్ కత్తిరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డులు, అత్యవసర చికిత్స విభాగం, ల్యాబ్ తదితర సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నాణ్యమైన సేవలు, అందుబాటు ధరల్లో చికిత్స అందించడం ద్వారా ప్రజలకు తోడ్పడాలని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ 'విహా' మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా, ఆమనగల్లు టౌన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివలింగం, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మానయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, జగన్, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, డైరెక్టర్ శ్రీశైలం, ఎంగలి ప్రసాద్, మాజీ ఎంపీపీ అనిత, ఫరీద్, సురేష్, రాజు, షాబుద్దీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story