- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం.. భర్త అరెస్ట్
విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి ముస్సోరీలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి ముస్సోరీలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె భర్త శ్రీ చరణ్ ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కూతురిని భర్తే చంపాడని రాధాగాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. తమకు న్యాయం చేయాలని డెహ్రాడూన్ లో న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మెజిస్ట్రీయల్ దర్యాప్తుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్సోరీ డివిజినల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14,15,16 తేదీల్లో శ్రీచరణ్, రాధాగాయత్రిల మధ్య ఏం జరిగిందన్న దానిపై విచారించేందుకు శ్రీచరణ్, అతని తల్లిదండ్రులు కూడా ఈ నెల 17న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే శ్రీచరణ్ ఆచూకీ తెలియడంతో డెహ్రాడూన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ మూడురోజులు ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? అన్న విషయాలతో పాటు.. రాధాగాయత్రి పేరెంట్స్ రాకుండానే పోస్టుమార్టమ్ ఎందుకు చేశారన్న విషయంపైనా విచారించనున్నారు. శ్రీచరణ్ తో పాటు పోస్టుమార్టం చేసిన సిబ్బందిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






