- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో తీరిన 20 ఏళ్ల తాగునీటి కష్టాలు
మండల కేంద్రంలోని మథుర కాలనీ–2లో ప్రజలు గత 20 ఏళ్లుగా బోర్ మోటార్ లేక తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు.

దిశ, నేరడిగొండ : మండల కేంద్రంలోని మథుర కాలనీ–2లో ప్రజలు గత 20 ఏళ్లుగా బోర్ మోటార్ లేక తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసుల సమస్యకు ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీవాసుల విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకుని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ రోడ్డు, మథుర కాలనీ–2లో రెండు బోర్లను మంజూరు చేశారు. వాటిని వెంటనే వేయించాలని స్థానిక సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డిని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్పందించిన సర్పంచ్ తక్షణమే రెండు బోర్లను వేయించి, మోటార్లను అమర్చించి శనివారం నుంచి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే డా. అనిల్ జాదవ్ స్పందనను, సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డి ప్రత్యేక చొరవను కొనియాడారు. తమ సమస్యను గుర్తించి త్వరితగతిన పరిష్కరించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోతి గులాబ్ సింగ్, పంచాయతీ కార్యదర్శి అరుణ్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






