గంగాధర బస్టాండ్ మూత్రశాలలకు తాళం!

by Jakkula.Mamatha |

గంగాధరలోని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న మూత్రశాలలకు తాళం వేసి ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గంగాధర బస్టాండ్ మూత్రశాలలకు తాళం!
X

దిశ, గంగాధర: గంగాధరలోని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న మూత్రశాలలకు తాళం వేసి ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, మహిళలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా మూత్రశాలలను బంద్ చేయడం పై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై బస్టాండ్ అధికారులను వివరణ కోరగా.. బాత్రూంలోని నీటి నల్లాలు విరిగి పోవడంతో నీరంతా వృథాగా పోతోందని, అందుకే శనివారం ఉదయం స్వీపర్లు వాటికి తాళాలు వేశారని తెలిపారు. అయితే, చిన్నపాటి సమస్యను సాకుగా చూపి రోజంతా మూత్రశాలలను మూసివేయడం సరికాదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నల్లాల మరమ్మతులు తక్షణమే పూర్తి చేయించి, మూత్రశాలలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story