- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగురాలి సమస్య పై స్పందించిన జిల్లా కలెక్టర్
పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దేవమ్మ గోడును జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఎంతో శ్రద్ధగా ఆలకించి, ఆమె సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

దిశ, పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు దేవమ్మ గోడును జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఎంతో శ్రద్ధగా ఆలకించి, ఆమె సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. శనివారం నాయినిపల్లి మైసమ్మ దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్, ఆలయ పరిసరాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవమ్మ తన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఎక్కడికన్నా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఒక మూడు చక్రాల మోటారు వాహనం మంజూరు చేస్తే తన జీవితం ఎంతో సులభమవుతుందని ఆమె జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.
దేవమ్మ మాటలను ఓపికగా విన్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమె వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆమెకు మూడు చక్రాల వాహనం మంజూరయ్యే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని దేవమ్మకు స్వయంగా హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా, దేవమ్మకు దివ్యాంగుల పింఛన్ సక్రమంగా అందుతుందా? ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా? అనే అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆమెను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం ప్రజా పాలనలో ముఖ్యమైన అంశమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు . ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా జిల్లా యంత్రాంగం పూర్తి బాధ్యతతో పనిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ దేవమ్మ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి వెంటనే స్పందించిన తీరు అక్కడున్న ప్రజల ప్రశంసలతో ముంచెత్తారు.






