వియత్నాం బోటు ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా

by Ajay Maddhiboyina |

వియ‌త్నాం బోటు ప్ర‌మాదంపై హోమంత్రి అనిత ఆరా తీశారు. అధికారుల‌తో మాట్లాడి ప్ర‌మాదం వివ‌రాల‌ను తెలుసుకున్నారు. భార‌త ఎంబ‌సీతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.

వియత్నాం బోటు ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా
X

దిశ‌, వెబ్ డెస్క్: వియ‌త్నాం బోటు ప్ర‌మాదంపై హోమంత్రి అనిత ఆరా తీశారు. అధికారుల‌తో మాట్లాడి ప్ర‌మాదం వివ‌రాల‌ను తెలుసుకున్నారు. భార‌త ఎంబ‌సీతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. టూరిస్టుల వివ‌రాలు సేకరించివ వారికి స‌హాయం చేయాల‌ని చెప్పారు. ఇదిలా ఉంటే వియ‌త్నాంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం స‌మీపంలో భార‌తీయ ప్ర‌యాణికులు వెళుతున్న బోటు అల‌ల దాటికి బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 19 మంది మ‌ర‌ణించారు.

వెంట‌నే స‌హాయ‌కబృందాలు రంగంలోకి దిగి కొంద‌రిని ర‌క్షించాయి. ర‌క్షించిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం అందుతోంది. బాధితులు ఓ మొబైల్ కంపెనీ డీల‌ర్స్ కాగా, ఆ కంపెనీ త‌ర‌పున టూర్ కు వెళ్లారు. టూరిస్టుల్లో ఏపీ నుండి 30 మంది, తెలంగాణ నుండి 45 మంది ఉన్నారు. మృతుల్లో ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌వాళ్లే ఉన్నార‌ని చెబుతున్నారు. ఏపీ నుండి ఎక్కువ మంది ఉండ‌టంతో హోంమంత్రి అనిత వెంట‌నే అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

Next Story