మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ.. ‘క్వీన్’ నుంచి పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’.

మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ.. ‘క్వీన్’ నుంచి పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్వీన్’. హీరోయిన్ సెంట్రిక్ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఇందులో డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తుండగా.. కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ‘క్వీన్’ చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. రమ్యకృష్ణ తమ సినిమా టీమ్‌లో జాయిన్ అవుతున్న సందర్భంగా చిత్రబృందం ఆమెకు ఆహ్వనం పలికారు. ‘క్వీన్’ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా, రియల్ క్యారెక్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ స్టోరీతో దర్శకుడు రతన్ రిషి రూపొందిస్తున్నారు. 2006-2010 మధ్య కాలం నేపథ్యంగా ఈ చిత్ర కథ సాగనుండగా.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

Next Story