మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా కె. ఆదిరెడ్డి

by Taduka Kalyani |

మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా ఇన్‌స్పెక్టర్ కె. ఆది రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.

మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా కె. ఆదిరెడ్డి
X

దిశ, చంపాపేట్ , జూలై 11: మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా ఇన్‌స్పెక్టర్ కె. ఆది రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది పూల మొక్కలను అందజేసి ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్‌హెచ్‌ఓ కె. ఆది రెడ్డి మాట్లాడుతూ, మలక్‌పేట్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నివారణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసు సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, సిగ్నల్స్‌ను గౌరవించి వాహనాలు నడపాలని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story