- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం
మంచాల మండలం పరిధిలోని సాగర్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, మంచాల: మంచాల మండలం పరిధిలోని సాగర్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆగపల్లి కంకర మిషన్ సమీపంలో ఫాక్స్‌కాన్ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సు, ఒక ద్విచక్ర వాహనం (బైక్) బలంగా ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సాగర్ హైవేపై వేగంగా వెళ్తున్న ఫాక్స్‌కాన్ బస్సు, బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా నుజ్జునుజ్జవగా, సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో బస్సులో ఉన్న కంపెనీ ఉద్యోగులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.






