రామ్ నా థెరపిస్ట్.. మరోసారి ఓపెన్ అయిన భాగ్యశ్రీ

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న ప‌ర్స‌న‌ల్, సినిమా లైఫ్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతున్నారు.

రామ్ నా థెరపిస్ట్.. మరోసారి ఓపెన్ అయిన భాగ్యశ్రీ
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ త‌న ప‌ర్స‌న‌ల్, సినిమా లైఫ్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ భాగ్య‌శ్రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న కోస్టార్స్ లో ఒక్కొక్క‌రి గురించి చెప్పాల‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. తాను ప‌నిచేసిన హీరోల్లో శివ‌కార్తికేయ‌న్ మోస్ట్ డిసిప్లేనిడ్ హీరో అని చెప్పారు. ర‌వితేజ బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ అని అన్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ మోస్ట్ స్టైలిష్ట్ ప‌ర్స‌న్ అని తెలిపారు. అఖిల్ బెస్ట్ లిస్ న‌ర్ అని అన్నారు.

అంతేకాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫోన్ మ‌ర్చిపోయే ప‌ర్స‌న్ అని జోక్ చేశారు. రామ్ పోతినేని చాలా వ‌ర‌కు నా థెర‌పిస్ట్ లాంటి వాడు అంటూ స‌మాధానం ఇచ్చారు. అంతేకాకుండా రామ్ పోతినేనితో మ‌ళ్లీ సినిమా ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నార‌ని ఖ‌చ్చితంగా త‌మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా చేస్తామ‌ని చెప్పారు. అయితే రామ్ పోతినేని భాగ్య‌శ్రీ ప్రేమ‌లో ఉన్నార‌ని, డేటింగ్ లో ఉన్నార‌ని చాలాకాలంగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో భాగ్య‌శ్రీ రామ్ గురించి త‌న థెర‌పిస్ట్ అంటూ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story