- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికా ఫుట్‌బాలర్ జేడెన్ ఆడమ్స్ ఆకస్మిక మృతి
సౌతాఫ్రికా ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టు మిడ్‌ఫీల్డర్, 25 ఏళ్ల జేడెన్ ఆడమ్స్ శనివారం ఆకస్మికంగా మరణించాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆడమ్స్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు కొందరు అనుమానిస్తున్నారు. అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు మరికొందరు చెబుతున్నారు. కుటుంబసభ్యులుగానీ, అధికారులుగానీ అతని మృతి గల కారణాన్ని వెల్లడించలేదు. సౌతాఫ్రికా ఫుట్‌బాల్‌లో ఆడమ్స్ అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్-2026లో కూడా పాల్గొన్నాడు. సౌతాఫ్రికా ఆడిన మూడు గ్రూపు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. దక్షిణాఫ్రికా గ్రూపు దశకే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో పాల్గొన్న కొన్ని రోజులకే ఆడమ్స్ ఆకస్మికంగా మరణించడం ఫుట్‌బాల్ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆడమ్స్ మృతి పట్ల ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గాయటన్ మెకెంజీలతో పాటు ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. సౌతాఫ్రికా తరపున 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆడమ్స్ రెండు గోల్స్ చేశాడు.






