- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ATM Robbery: సినిమా తరహాలో ఏటీఎం చోరీ.. థార్ వాహనంతో ఈడ్చుకెళ్లిన దొంగలు
సినిమా తరహాలో ఏటీఎం చోరీ చేసిన ఘటన వైరల్ అవుతోంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా తరహాలో ఏటీఎం చోరీ చేసిన ఘటన వైరల్ అవుతోంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం మెషిన్‌కే తాడు కట్టి, తమ కారుతో ఈడ్చుకెళ్లి నగదును లూటీ చేశారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఐదుగురికి పైగా ముఠా సభ్యులు ఓ నల్లటి థార్ (Thar) వాహనంలో ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకున్నారు. మెషిన్‌కు తాడు కట్టి, మరో చివరను తమ వాహనానికి కట్టి బలంగా లాగడంతో ఏటీఎం యంత్రం పూర్తిగా ఊడి వచ్చింది.
నగదు లూటీ.. పోలీసుల దర్యాప్తు
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. రాత్రి 2:14 నుంచి 2:17 నిమిషాల మధ్య ఈ తతంగం ముగిసింది. ఊడ వచ్చిన ఏటీఎంను రోడ్డుపైనే కొంతదూరం నిర్మానుష్య ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. అనంతరం దాన్ని పగలగొట్టి, అందులోని నగదును దోచుకుని పరారయ్యారు. ఏటీఎంలో ఎంత డబ్బు ఉందనేది ఇంకా స్పష్టం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన ఏటీఎంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో దొంగతనాలు బాగా పెరిగాయని, రాత్రివేళల్లో భద్రత కట్టుదిట్టం చేసి పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






