హైదరాబాద్ బొల్లారంలో అగ్నిప్రమాదం.. పరుపుల గోదాంలో చెలరేగిన మంటలు

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ లోని ఏడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పరుపుల గోడౌన్ లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది.

హైదరాబాద్ బొల్లారంలో అగ్నిప్రమాదం.. పరుపుల గోదాంలో చెలరేగిన మంటలు
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఏడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ పరుపుల గోడౌన్ లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే ఫైర్ సిబ్బంది అక్క‌డకు చేరుకున్నారు. మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల కాలంలో అగ్నిప్ర‌మాదాలు పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ప‌రుపుల గోడౌన్ లలో అగ్నిప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటీవలే ఉప్పల్ లోనూ ఓ పరుపుల గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. పరుపుల దుకాణాలు, గోడౌన్ లలో అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మంటలు కూడా చాలా వేగంగా వ్యాపిస్తాయి కాబట్టి ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

Next Story