జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్

by Ajay Maddhiboyina |

ప్రముఖ సినీ నేపథ్య గాయని, సంగీత దర్శకురాలు ఎస్. జానకమ్మ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ సినీ నేపథ్య గాయని, సంగీత దర్శకురాలు ఎస్. జానకమ్మ మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం దక్షిణ భారత సంగీతానికి, పాటల రంగానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో దాదాపు 50 వేల పాటలు పాడిన ఆమె కీర్తి అజరామరమని కొనియాడారు. జానకమ్మ తండ్రి ఉద్యోగరీత్యా నాటి కరీంనగర్ జిల్లాలో జీవించారని, వారి కుటుంబం సిరిసిల్ల వాసులు కావడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన ధీర వనిత ఆమె అని కొనియాడారు. ఆ మహా గాయని మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, కోట్ల మంది అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Next Story