వైభ‌వ్ కు మ‌రో ఎదురుదెబ్బ‌..ఆ టోర్న‌మెంట్ నుంచి ఔట్?

by velandi.Saikiran |

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఐదో టీ20 మ్యాచ్ కు దూరమైన వైభవ్, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

వైభ‌వ్ కు మ‌రో ఎదురుదెబ్బ‌..ఆ టోర్న‌మెంట్ నుంచి ఔట్?
X

దిశ, వెబ్ డెస్క్: 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు బిగ్ షాక్ తగిలింది. ఐదో టీ20 మ్యాచ్ కు దూరమైన వైభవ్, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమే కాకుండా, అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచినట్లు బీసీసీఐకి నివేదిక వెళ్ళినట్లు చెబుతున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది.

ఇక నుంచి భార‌త జట్టుకు ఏది మంచిదో అదే చేయాలనుకుంటున్నాం... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రేయస్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ 2008 ప్లాన్ లో వైభవ్ సూర్యవంశీ ఉండకపోవచ్చని చర్చ మొదలైంది. ఇతరులతో ప్రయోగం చేస్తారని కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే వైభవ్ ఇప్పట్లో రీ-ఎంట్రీ ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. కాగా, ఇంగ్లాండ్ తో ఆడిన మూడు మ్యాచ్ ల‌లో వైభవ్ విఫలమయ్యాడు.

Next Story