- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..రూ.339.39 కోట్లతో!
జోగులాంబ గద్వాల జిల్లాలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, జోగులాంబ ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్-2 ప్యాకేజీ కింద హం ఫేస్ -Iలో మొత్తం 8 రహదారి పనులకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.339.39 కోట్ల వ్యయంతో 125.89 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, బలోపేతం పనులు చేపట్టనున్నారు. ఈ ప్యాకేజీలో గద్వాల–ఐజ్జ, యర్రిగెర–అలంపూర్, గద్వాల–రాయచూర్, గద్వాల–రంగాపూర్, గట్టు–మాచెర్ల తదితర ప్రధాన రహదారుల విస్తరణ, బలోపేత పనులు చేపట్టనున్నారు. జిల్లాలోని గద్వాల, మల్దకల్, ధరూర్, పూడూరు, వీరాపురం, అలంపూర్, గట్టు తదితర మండలాలకు ఈ పనుల ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
అత్యధికంగా 52.70 కి.మీ. పొడవు గల యర్రిగెర–అలంపూర్ రహదారి విస్తరణకు రూ.169.02 కోట్లు కేటాయించగా, గద్వాల–రాయచూర్ రహదారి విస్తరణకు రూ.74.29 కోట్లు, గద్వాల–రంగాపూర్ రహదారి పనులకు రూ.39.84 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారి పనులు పూర్తయితే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం, ప్రయాణ సమయం తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించనుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో రోడ్ల మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ప్యాకేజీ కీలకంగా మారనుంది.






