- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చట్టం చేసినా ‘ఆర్బిట్రేషన్’ ఆచరణలోకి రాలేదు : సీజేఐ సూర్యకాంత్ అసంతృప్తి
ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ చట్టం చేసినా ఇంకా అమలులోకి రాలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని పెంపొందించేందుకు ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏసీఐ) ఏర్పాటు చేయాలని పార్లమెంటు చట్టం చేసి 7 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు దానిని ఏర్పాటు చేయకపోవడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టం పుస్తకాల్లోనే ఉండిపోయిందని, కానీ ఆచరణలోకి రాలేదని అన్నారు. ప్రకటనలకు, అమలుకు మధ్య ఉన్న ఈ సుదీర్ఘ కాలయాపనే మన విశ్వసనీయత లోపానికి ప్రధాన కారణం స్పష్టం చేశారు. ఢిల్లీలో ‘రీఇమేజినింగ్ ఎడిఆర్: ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ జస్టిస్’ అనే అంశంపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియాషన్ (ఐఐఏఎం) సిల్వర్ జూబ్లీ ఏడీఆర్ సదస్సు ప్రారంభోపన్యాసంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024, 2025 సంవత్సరాల్లోనూ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను అత్యధికంగా ఉపయోగించుకున్న విదేశీ సంస్థల్లో భారతీయ కంపెనీలు మూడో స్థానంలో ఉన్నాయని అన్నారు. మరో మాటలో చెప్పాలంటే, మన నియంత్రణలో లేని, మనం రాయని చట్టాల ప్రకారం నడిచే ఒక విదేశీ కేంద్రానికి మన సొంత వాణిజ్య వివాదాలను పంపుకుంటున్నామనిఅన్నారు. సింగపూర్ సంస్థలను విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం అని అన్నారు.






