- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ మందిరంలో చోరీ మహాపాపం : దీనిపై సుప్రీంకోర్టుతో విచారణ జరపాలి : కన్హయ్య కుమార్
అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీని కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ మహాపాపంగా అభివర్ణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు.

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీని మహాపాపం కాంగ్రెస్ నేత, ఎన్ఎస్‌యూఐ ఇంఛార్జ్ కన్హయ్య కుమార్ అన్నారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు ఎంతో నమ్మకంతో ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేసిన వారిని, ఇందులో బాధ్యులైన వారిని తప్పకుండా పట్టుకోవాలని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవని, అయితే ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సిట్‌కు ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. దొంగతనం జరగకుండా చూడాలని దొంగను పెట్టవచ్చా ? పాలను కాపాడమని పిల్లిని అడగవచ్చా ? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన సంస్థలను నియంత్రించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదని, అయితే భక్తులు సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేసిన ఘటనపై ప్రశ్నలు లేవనెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న ట్రస్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






