టార్గెట్ త‌క్కువగా ఉంటే, ఈజీగా గెలిచేవాళ్లం - శ్రేయ‌స్‌

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ చేతిలో చివరి మ్యాచ్ లోనూ ఓటమి పాలైన భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

టార్గెట్ త‌క్కువగా ఉంటే, ఈజీగా గెలిచేవాళ్లం - శ్రేయ‌స్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ చేతిలో చివరి మ్యాచ్ లోనూ ఓటమి పాలైన భారత జట్టు ప్రదర్శనపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి మ్యాచ్ లో 220 నుంచి 225 పరుగుల టార్గెట్ ఉండి ఉంటే కచ్చితంగా ఛేజ్ చేసే వాళ్ళమని వివరించారు. టార్గెట్ పెద్ద‌ది కావ‌డంతో, ఒత్తిడికి లోనైన‌ట్లు పేర్కొన్నారు. సరైన స్థానంలో బౌలింగ్ చేయకపోవడం, క్యాచ్ లు వదిలివేయడం తమ ఓటమికి కారణం అయ్యాయని స్పష్టం చేశారు. ఈ టీ20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ నుంచి కండిషన్స్ మారుతూ వచ్చాయన్నారు. గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయని తెలిపారు. వాటిని అడాప్ట్ చేసుకోవడం ముఖ్యమన్నారు. ఫీల్డింగ్ పై మేము ఇంకా చాలా వర్క్ చేయాలని తెలిపారు. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా, ఈ సిరీస్ ను 4-0 తేడాతో కైవ‌సం చేసుకుంది ఇంగ్లాండ్.

Next Story