- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త హత్య కేసులో భార్యపై అనుమానాలు
దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవిందు అలియాస్ గోన (53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

దిశ, దామరచర్ల : దామరచర్ల మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవిందు అలియాస్ గోన (53) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతదేహం పై గాయాలు ఉండటంతో ఇది హత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన పై మృతుడి సోదరుడు ఇస్లావత్ దూదియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, మృతుడి భార్య ఇస్లావత్ సరోజ అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఇద్దరూ కలిసి గోవిందును హత్య చేశారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అక్రమ సంబంధం నేపథ్యంలో సరోజ, చెన్నబోయిన శ్రీను కలిసి గోవిందును ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాల పై సమగ్ర విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.






