కోదాడ–జడ్చర్ల రహదారి పై రోడ్డు ప్రమాదం

by Batti.Sumithra |

లారీని ఢీకొన్న కారులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కోదాడ–జడ్చర్ల రహదారిపై పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

కోదాడ–జడ్చర్ల రహదారి పై రోడ్డు ప్రమాదం
X

దిశ, పెద్దవూర : లారీని ఢీకొన్న కారులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన కోదాడ–జడ్చర్ల రహదారిపై పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండకు చెందిన శ్రీరామదాసు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నంబర్ గల కారులో ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి దేవరకొండకు బయలుదేరారు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో వారు పెద్దవూర మండలంలోని లింగంపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే, ఎదురుగా దేవరకొండ వైపు నుంచి హాలియా వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న శ్రీరామదాసుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ ముత్యాలు, అలాగే కారులో ఉన్న మరో వ్యక్తి ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై గోపాలరావు తెలిపారు.

Next Story