- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ పశువుల రవాణాకు ఎస్కార్ట్‌గా కారు..!
అక్రమ పశువుల రవాణాకు ఎస్కార్ట్‌గా కారు వినియోగించడం.. తనను న్యూస్ రిపోర్టర్‌గా పరిచయం చేసుకుంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం దుమ్ముగూడెం మండలంలో కలకలం రేపింది.

దిశ, దుమ్ముగూడెం: అక్రమ పశువుల రవాణాకు ఎస్కార్ట్‌గా కారు వినియోగించడం.. తనను న్యూస్ రిపోర్టర్‌గా పరిచయం చేసుకుంటూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం దుమ్ముగూడెం మండలంలో కలకలం రేపింది. ములకపాడు సెంటర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య ఆదేశాల మేరకు ఎస్సై శ్యాంప్రసాద్ శనివారం ములకపాడు సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చర్ల నుంచి కోదాడ వైపు టీజీ-28టీ-6087 ట్రాలీ వాహనంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు, టీఎస్-28ఎం-1423 కారును ఎస్కార్ట్‌గా వినియోగిస్తున్నట్లు అందిన సమాచారంతో రెండు వాహనాలను అడ్డగించి తనిఖీ చేశారు. ట్రాలీలో పశువులు ఉన్నట్లు గుర్తించి వాహనాల్లోని వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల వివరాల ప్రకారం, చర్ల మండలం సీఆర్ కాలనీకి చెందిన చిన్న నరేంద్ర, కలివేరు గ్రామానికి చెందిన మాడిపాక వెంకటేష్, ఎటపాక మండలానికి చెందిన తెలగరి వినయ్‌కుమార్, కోదాడకు చెందిన రామిశెట్టి రవికుమార్‌తో పాటు భద్రాచలానికి చెందిన సోలేటి శ్రీశ్రీ ఈ వ్యవహారంలో ఉన్నట్లు తేలింది. విచారణలో సోలేటి శ్రీశ్రీ తనను న్యూస్ రిపోర్టర్‌గా చెప్పుకుంటూ ట్రాలీ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్తూ, డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






