- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీలో జీసీడీవో ఆకస్మిక తనిఖీ
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జిసిడిఓ అస్త్ర ఖాద్రి అన్నారు.

దిశ, మిడ్జిల్: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని జిసిడిఓ అస్త్ర ఖాద్రి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాఠశాలలో వంట మహిళల కొరత , ఉపాధ్యాయుల పనీతీరు విద్యాబోధన తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థినిలకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. సమన్వయంతో పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు ప్రత్యేక అధికారిని కవిత వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో సిఆర్టి ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. నూతన మంజూరైన మరుగుదొడ్లు మూత్రశాలల నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మండల ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వంట మహిళల పోస్టులకు దరఖాస్తులు..
కేజీబీవీలో ఖాళీగా ఉన్న మూడు వంట మహిళల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండు హెడ్ కుక్స్ కు 10వ తరగతి అర్హత, ఒకటి సహాయ వంట మనిషికి 7వ తరగతి అర్హత. ఆసక్తి ఉన్న మహిళలు జులై 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.






